దారుణం : పెన్షన్ ఇవ్వాలని ఇంటికి వెళ్లి మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు, నిందితులకు కఠిన శిక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.
తాజాగా ఓ గ్రామా వాలంటీర్ వృద్ధురాలికి పెన్షన్ ఇవ్వాలనే నెపంతో ఆమె ఇంటికి వెళ్లి మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందిన పుంగనూరు మండలంలోని ఓ గ్రామంలో నరేష్ అనే యువకుడు గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నాడు.
ఇందులో భాగంగా స్థానిక గ్రామంలో వృద్ధురాలికి పెన్షన్ అందజేసేందుకు గాను ఆమె ఇంటికి వెళ్లాడు.
ఈ క్రమంలో వృద్ధురాలి ఇంట్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఒంటరిగా ఉండటంతో ఆమెపై దారుణంగా అత్యాచారం చేశా డు.
అంతేకాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో పనుల నిమిత్తం బయటకు వెళ్ళి నటువంటి బాలిక తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాలిక ప్రవర్తనలో మార్పుని చూసి ఏమైందని ప్రశ్నించగా బాలిక తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తన తల్లిదండ్రులతో చెబుతూ బోరున విలపించింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి గ్రామ వాలంటీర్ పై ఫిర్యాదు నమోదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను మరియు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించిన స్థానిక రాజకీయ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన గ్రామ వాలంటీర్లు ఇలా అత్యాచారాలకు పాల్పడి తమ పరపతిని ఉపయోగించి బాధితులను బెదిరించి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోకోవడం సరికాదని అంటున్నారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా నిజంగానే ముహూర్తం జరుపుకుంటుందా..?