గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో! – పడకేసిన పారిశుధ్యం-పేరుకుపోయిన చెత్త

రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో గ్రామ వార్డు మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్, వాస్తవం రిపోర్టర్ మిరియాల్ కార్ శ్రీనివాస్, ఊరి యువకుల సహాయంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తంను గ్రామపంచాయతీ చెత్తను సేకరించే ఆటోలో చెత్తను ఎత్తి పాఠశాల ముందున్న చెత్తను తొలగించారు.

పాఠశాల ముందు భారీగా చెత్త పేరుకుపోవడంతో నిత్యం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలగడంతో అది గమనించిన వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, కూలీలతో, అక్కడే ఉన్న యువకులతో, పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలసి చెత్తను ఎత్తి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు.

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని వార్డు మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

విద్యార్థుల మేలుకోరి వారి శ్రేయస్సు దృశ్య అక్కడ చెత్తను మొత్తం శుద్ధి చేయడమే కాకుండా గిద్ద చెరువులో చెత్తను పడవేశామని తెలిపారు.

బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు వేసిన వేణుస్వామి.. షో గురించి అలా చెబుతూ?