పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలి
TeluguStop.com
త్వరలో బ్యాంక్ గ్యారంటీ అందజేస్తాం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ కు వినతి పత్రం అందజేసిన పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2024-25 ధాన్యం తమకు కేటాయించాలని పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో అదనపు కలెక్టర్ ను పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.తమకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కేటాయించే ధాన్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
తమకు కేటాయించే ధాన్యానికి మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని స్పష్టం చేశారు.కొనుగోలు కేంద్రాల ద్వారా పాత గన్ని బ్యాగుల్లో ధాన్యం పంపాలని, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చే బియ్యానికి సరిపడా కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలని, తమకు సన్న ధాన్యం కేటాయించవద్దని కోరారు.
2023-24 రబీ సీజన్ నిల్వల ప్రాతిపదికన పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
వినతి పత్రం అందజేసిన వారిలో
పారా బాయిల్డ్ రైస్ మిల్లుల సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
జలుబు, దగ్గు దరిచేరకుండా ఉండాలంటే ఈ పని తప్పక చేయండి!