మార్కెట్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ధాన్యం బస్తాలు-కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
TeluguStop.com

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


గత రెండు రోజుల క్రితం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను
పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.


కృష్ణారెడ్డి మార్కెట్లో ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు.
కానీ,జిల్లా కలెక్టర్ ఆదేశాలను మార్కెట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.సుమారుగా 5 వేల ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా మార్కెట్లో నిల్వ ఉన్నాయి.
దీంతో కొత్తగా ధాన్యం తెచ్చే రైతులు
మార్కెట్లో ధాన్యం పోసుకోవడానికి స్థలం లేక నానా
ఇబ్బందులు పడుతున్నారు.
చెన్నైలో విదేశీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణం.. ‘అది చీరేస్తా’ అంటూ అసభ్య బెదిరింపులు!