ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

డి వై ఏఫ్ ఐ.జిల్లా అధ్యక్షుడు.

గంతుల మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో సొసైటీ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతుల నుండి సంబంధిత అధికారులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి అన్ని సొసైటీ,ఐకేపీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని అన్నారు .

గత 20,25 రోజులుగా అనేక మంది రైతులు( Farmers ) తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి అధికారులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నదన కావున అధికారులు ఇప్పటివరకు పలాన రోజు ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తామని నేటికి స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడం చాలా దారుణమని అన్నారు.

గత పంటకూడ వెంట వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని ఆయా కేంద్రాలలో నిల్వ చేసుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదురుకున్నారని, రైతులు పోయిన పంటకాలంలో కొనుగోలు సెంటర్లో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ నానా ఇంబ్బందులు పడ్డారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

లేనియెడల రైతులతో కలిసి సంబంధిత అధికారుల ఆఫీసులో ముట్టడిస్తామని అన్నారు.

ఆ విషయంలో పశ్చాత్తాపపడిన రాజ్ తరుణ్.. బిగ్ బాస్ విషయంలో క్లారిటీ ఇదేనంటూ?