పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి – అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో (2023-24)  యాసంగి సీజన్ ధాన్యం సేకరణ మరో పది రోజుల్లో పూర్తికానుందని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 259 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని వెల్లడించారు.

ఐకేపీ, పిఎసిఎస్ డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని వివరించారు.ఇప్పటిదాకా దాదాపు 31,201 మంది రైతుల నుంచి 2,08,566 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి,  2,02,125 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు.

28,612 రైతుల ఖాతాల్లో  రూ.344 కోట్లు జమ చేశామని వెల్లడించారు.

H3 Class=subheader-styleశిక్షణ అందించి ఏర్పాట్లు/h3p ఏడాది యాసంగి సీజన్ ధాన్యం సేకరణ కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణకు ఏర్పాటు చేయించారు.

ముందస్తుగా ఆయా కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలుమార్లు శిక్షణ ఇప్పించారు.అలాగే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తూకం వేసే యంత్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్పాలిన్ తదితర సామాగ్రి ముందుగానే తరలించేలా ఏర్పాటు చేశారు.

ఈసారి నూతనంగా ఐరిష్ యంత్రాన్ని కూడా ప్రవేశపెట్టారు.అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు .

H3 Class=subheader-styleఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం/h3p జిల్లాలోని రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వాతావరణ శాఖ సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చేరవేశారు.

ఏ రోజు వర్షం కురిసే అవకాశం ఉందో ముందస్తుగానే సమాచారం అందించడంతో ధాన్యాన్ని తడవకుండడా టార్పాలిన్లు అందజేసి జాగ్రత్తగా కాపాడే చర్యలు చేపట్టారు.

లారీలను కూడా అందుబాటులో ఉంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించారు.

H3 Class=subheader-styleపార సరఫరాల శాఖ కమిషనర్ తనిఖీ/h3p జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల అలాగే పలు కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఈ నెల 8 వ తేదీన తనిఖీ చేశారు.

నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.దాన్యం తడవకుండా కింద పైన టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ట్యాబ్ ఎంట్రీలు ఆన్లైన్లో వేగంగా పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని ఆదేశించారు.

  కమిషనర్ పర్యటనతో కొనుగోలు కేంద్రాల్లో పటిష్ట చర్యలు చేపట్టి దాన్యం కొనుగోలు వేగంగా పూర్తయ్యాలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం సేకరించడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్యం సేకరించి తమ ఖాతాలో డబ్బులు జమ చేసిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

H3 Class=subheader-styleపక్కా ప్రణాళికతో సేకరణ/h3p జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం సేకరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాం.

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పించి, వారికి కావాల్సిన యంత్రాలు ఇప్పించాం.రైతులకు ఇబ్బందులేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయించాం.

దేవర మూవీ ట్రైలర్ పై షాకింగ్ అప్ డేట్ వైరల్.. అప్పటివరకు ఎదురుచూపులు తప్పవా?