అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతుంది..: చంద్రబాబు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సమస్యల పరిష్కారానికి రోడ్లెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతుందని ఆరోపించారు.

"""/" / నిరసన కార్యక్రమాలను అణచివేయడం, అనైతిక పద్ధతుల్లో సమ్మెను విచ్ఛిన్న చేయడానికి బదులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టి ఉంటే ఫలితం ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వం అంగన్వాడీలను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఖండిస్తున్నామని తెలిపారు.సీఎం జగన్ తన అహాన్ని ఇప్పటికైనా పక్కన పెట్టి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో పెన్షన్ పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!