ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు..!

ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

అదేవిధంగా రెండు వేల పడకల నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

నిమ్స్ విస్తరణకు రూ.1571 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

నగరం నలువైపులా నాలుగు వేల పడకలతో నాలుగు టిమ్స్ ఆస్పత్రులను నిర్మించనున్నారు.ఇప్పటికే వరంగల్ లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పేదలకు వైద్యరంగానికి పెద్ద పీట వేశారని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

యంగ్ హీరోలలో శ్రీవిష్ణును ఎంత మెచ్చుకున్నా తక్కువేనా.. ఎందుకంటే?