మూత పడిన సర్కార్ బడి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మోతె మండలం మేకలపాటి తండాలో విద్యార్థులు లేరనే వంకతో ప్రాథమిక పాఠశాలను మూసేశారు.
ఇక్కడ పని చేసే టీచర్స్ ను డిప్టేషన్ పై పక్క గ్రామంలోని స్కూల్ లో విద్యా బోధన చేస్తున్నారని తెలుస్తుంది.
దీనితో మేకలపాటి తండా పాఠశాల బిల్డింగ్ ప్రస్తుతం పశువుల కొట్టాన్ని తలపిస్తుండంగా,స్కూల్ వెళ్లలేని పేద విద్యార్థులు పశువుల కాపరులుగా మారుతున్నారు.
విద్యాశాఖా అధికారులు, స్థానిక ఉపాధ్యాయులు,గ్రామస్థుల సహకారంతో విద్యార్థులను బడిబాట పట్టేలా చూడాల్సింది పోయి,అందరూ ప్రైవేట్ స్కూల్ కి పోతున్నారని సాకు చూపి స్కూల్ మూతవేయడం దేనికి సంకేతమని తండా వాసులు వాపోతున్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి పాఠశాలను పున: ప్రారంభించాలని కోరుతున్నారు.
నాని ప్యారడైజ్ సినిమాలో మలయాళం స్టార్ హీరో…