కేంద్రం నూతన ఆలోచన, ప్రజల రక్షణ కోసం సురక్ష స్టోర్స్

దేశ ప్రజల రక్షణార్థం లాక్ డౌన్ ను ప్రకటించిన నరేంద్ర మోడీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది.

లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట కలిగించే విధంగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రజల కోసం అని సురక్ష స్టోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ను విధించడం తో గ్రాసరీ షాప్స్ మినహా మిగతా వన్నీ కూడా క్లోజ్ అవ్వడం తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ లాక్ డౌన్ తో హెయిర్ కటింగ్,బట్టలు షాపు లకు వెళ్లలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సురక్ష స్టోర్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

వచ్చే 45 రోజుల్లో 20 లక్షల సురక్ష స్టోర్ల ఏర్పాటును కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సురక్ష స్టోర్ల ఏర్పాటు కోసం ఎఫ్ఎంసీజీ కంపెనీలతో మోడీ సర్కార్ జతకట్టనుంది.

అంతేకాకుండా ప్రభుత్వం పేర్కొన్న అర్హతలు కలిగిన కిరాణా స్టోర్లు, గ్రాసరీ స్టోర్లు కూడా సురక్ష స్టోర్లుగా వ్యవహరించడానికి కేంద్రానికి దరఖాస్తు చేసుకోనే అవకాశం కలిపిస్తుంది.

కేవలం గ్రాసరీ స్టోర్లను మాత్రమే కాకుండా డ్యూరబుల్ కన్సూమర్ ప్రొడక్ట్స్ షాప్స్, వస్త్ర దుకాణాలు, సెలూన్స్ (కటింగ్ షాప్స్) వంటి వాటి వాటిని కూడా సురక్ష స్టోర్ల కిందకు తీసుకురానున్నట్లు సమాచారం.

ఈ షాపుల్లో హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది.అలాగే స్టాఫ్ అందరరికీ మాస్క్‌లు తప్పనిసరి.

కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ స్కీమ్ అమలు బాధ్యతలను అప్పగించొచ్చు.

ఈ కంపెనీలు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రూల్స్‌ను ఫాలో అవుతాయి. """/"/ అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం, మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

అయితే రేపు జాతినుద్దేశించి మాట్లాడబోయే ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ ను పొడిగించడం వంటి నిర్ణయం తో పాటు ఈ సురక్ష స్టోర్స్ గురించి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే 1లక్షకు పైగా ప్రజలు మృతి చెందగా,18 లక్షల మందికి పైగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?