నన్ను బాగుచేయండి మహాప్రభో…!

నల్లగొండ జిల్లా: నేను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉమ్మడి బంధువును.ఎన్నో ఏళ్లుగా వందలాది వాహనాలకు,వేలాది మంది ప్రయాణికులకు మార్గమై దారి చూపాను.

హెవీ వెహికిల్స్ పెద్ద లోడ్లతో నా మీద నుండి పోతుంటే కృంగిపోతూ సేవలు అందించాను.

గత కొన్నేళ్లుగా నా ఒంటి నిండా గాయాలై నడవడానికి కూడా పనికిరాకుండా పోతే గత పాలకులు తొమ్మిదేళ్ళ క్రితం నాకు చికిత్స మొదలు పెట్టారు.

కానీ,నేటి వరకు నాలో ఏ మార్పు లేకుండా అలాగే పడి ఉన్నాను.అయినా నా సేవలు పొందుతూనే నన్ను అవమానిస్తున్నారని నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో ఉండే భీమారం - మిర్యాలగూడ ప్రధాన రహదారి తన దీన గాథను ఎవరూ పట్టించుకోక వచ్చి పోయే వాహనాలతో వాపోతోంది.

గత పాలకులు ఎలాగో నన్ను చికిత్స పేరుతో జనరల్ వార్డులో పడేసి వెళ్ళిపోయారు.

ప్రస్తుత పాలకులైన ఐసీయూలో పెట్టి ఎమర్జెన్సీ చికిత్స అందించి మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని వేడుకుంటుంది.

సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారి వరకు 28 కి.

మీ.రోడ్డును నేను.

నకిరేకల్, మిర్యాలగూడ,సూర్యాపేట మూడు నియోజకవర్గాల పరిధిలో శెట్టిపాలెం, మొలకపట్నం,రావులపెంట,లక్ష్మీదేవిగూడెం,ఆమనగల్లు,భీమారం,వెదురువారిగూడెం తండా,కుసుమవారిగూడెం గ్రామాలో విస్తరించి ఉంటాను.

రోజుకు వందలాది వాహనాలు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి శిధిలావస్థకు చేరుకోవడంతో గత పాలకులు పునర్నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసి 9 ఏళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు.

ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాకుండా నిర్లక్ష్యానికి గురయ్యాను.నా నిర్మాణం పూర్తైతే సూర్యాపేట,నల్లగొండ రెండు జిల్లాలతో పాటు వరంగల్ నుండి గుంటూరు వరకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుంటుంది.

కానీ,గత పాలకుల,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నా పాలిట శాపంగా మారింది.ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా మన జిల్లా కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడంతో మళ్ళీ నా ఆశలు చిగురించాయి.

తొమ్మిదేళ్లుగా నిర్మాణంలో భాగంగా వేములపల్లి కల్వర్టులు ఆధునీకరణ పూర్తికాలేదు.బాక్స్ కల్వర్టులు నిర్మాణంలో ఉండగా,ఇంకా గూనల ద్వారా నిర్మించాల్సిన కల్వర్టులు అలాగే ఉన్నాయి.

పూర్తైన బిడ్జీల వద్ద మట్టి పోయకపోవడంతో తాత్కాలిక రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తుంది.రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని పలు గ్రామాల్లో రాస్తోరోకోలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇక ఇప్పుడు అసలే ఆర్ధిక సహాయం చేసే వర్షాకాలం, పెద్ద పెద్ద గుంతలు,అందులో నీళ్లు నిలిచి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నా.

ఫుడ్ వెండర్ సమాధానానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్