ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం..!!

ఏపీకి డిప్యూటేషన్ పై( Deputation ) వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని నిర్ణయించింది.అదేవిధంగా ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే తమ డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతూ పలువురు అధికారులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తమను తిరిగి తమ మాతృసంస్థకు పంపాలని విన్నవించారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి( TTD EO Dharmareddy ) సెలవు దరఖాస్తును సర్కార్ తిరస్కరించింది.

మరోవైపు సీఐడీ చీఫ్ సంజయ్( CID Chief Sanjay ) తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.

అయితే ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన పలువురు అధికారులపై గతంలో టీడీపీ విమర్శలు చేసింది.

ఇప్పుడు వారంతా డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరడంతో ఎవరినీ రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!