ఏపీ ఉభయ సభల ప్రోరోగ్‌కు గవర్నర్ ఉత్తర్వులు
TeluguStop.com
ఏపీ ప్రభుత్వం అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తోంది.వికేంద్రీకరణ బిల్లు మండలిలో సెలక్షన్ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
మండలి మనుగడలో ఉండగా ఆర్డినెన్స్‌ను తీసుకు రావడం కుదరని పని.ఒక బిల్లు సెలక్షన్ కమిటీ ముందు ఉన్న సమయంలో ఆర్డినెన్స్‌ను తీసుకు రావడం అనేది చట్ట విరుద్దం.
ఒక వేళ తీసుకు వచ్చినా కూడా కోర్టుకు వెళ్తే ఆ ఆర్డినెన్స్ చెల్లదు.
అందుకే ప్రభుత్వం అసెంబ్లీ మరియు మండలిలను ప్రోరోగ్ చేయడం ద్వారా తమ పనిని సులువు చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఏపీ గవర్నర్ నేడు అసెంబ్లీ మరియు మండలిని ప్రోరోగ్ చేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను చేసుకునే అవకాశం ఉంటుంది.వెంటనే వికేంద్రీకరణ బ్లిుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం నుండి గవర్నర్‌కు ముఖ్యమంత్రి చెప్పించడం వల్లే ఈ ప్రోరోగ్ నోటీసులు వచ్చాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుంది.వికేంద్రీకరణ బిల్లు పాస్ అవ్వడం రాష్ట్రంకు మూడు రాజధానులు అధికారికంగా ఏర్పటడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నితిన్ భరత్ లు స్టార్ డైరెక్టర్లుగా మారతారా..?