“హనుమాన్” సినిమా యూనిట్ ని అభినందించిన తెలంగాణ గవర్నర్..!!
TeluguStop.com
ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన "హనుమాన్" సినిమా ( Hanuman Movie ) బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా( Teja Sajja ) నటించిన ఈ సినిమా.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది.ఈ క్రమంలో రిలీజ్ అయిన ప్రతి చోట విజయం సాధించింది.
జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా.200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.
"హనుమాన్" సినిమా కంటే పెద్ద సినిమాలు విడుదలైన గాని ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
అతి తక్కువ బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ అద్భుతంగా చూపించడం జరిగింది.ఈ సందర్భంగా సినిమా యూనిట్ ని చాలామంది ప్రముఖులు అభినందిస్తున్నారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై."హనుమాన్" చిత్ర బృందాన్ని అభినందించారు.
"""/" /
"హనుమాన్" సినిమా విజయం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు.విఎఫ్ఎక్స్ విజువల్స్ తో దర్శకుడు పనితీరు.
హీరో తేజ సజ్జా నటననీ తమిళిసై( Governor Tamilisai ) కొనియాడారు."హనుమాన్" సినిమా విజయం సాధించటంతో ఇప్పుడు సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
"జై హనుమాన్"( Jai Hanuman ) పేరిట సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది.
2025లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు."జై హనుమాన్" సినిమాలో హనుమాన్ హీరో అని ఆ పాత్రని ఓ స్టార్ హీరో పోషించబోతున్నట్లు పేర్కొన్నారు.
దీంతో ఇప్పుడు సీక్వెల్ "జై హనుమాన్" పై సినీ లవర్స్ కి ఆసక్తి ఏర్పడింది.
ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. మంచి భర్త దొరికాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!