గవర్నర్ ఇఫ్తార్ విందు... సీ ఎం హోదాలో జగన్

రంజాన్ నెల కావడం తో దేశ వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ నూతన ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఇస్తున్న ఈ విందు కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ లకు చెందిన నేతలకు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం.

అయితే ఏపీ సీ ఎం హోదాలో తొలిసారి జగన్ హైదరాబాద్ రానున్నారు.గత నెల 30 న ఏపీ నూతన సీ ఎం గా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

"""/"/ గవర్నర్ నరసింహన్ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి వేలాది మంది వైసీపీ కార్యకర్తల తో పాటు తెలంగాణా సి ఎం కేసీఆర్,డీ ఎంకే అధినేత స్టాలిన్ లు కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ హైదరాబాద్ రానుండడం ఇదే తొలిసారి.

ఇక.ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 3న గుంటూరులో ముస్లిం సోదరులకు సీ ఎం జగన్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

గవర్నర్‌ ఇస్తున్న ఇఫ్తార్‌ విందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.

అయితే ఆయన హాజరవుతారా? లేదా? అనే విషయం పై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

ప్రసన్నవదనం మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?