అందరికీ అందుబాటులోకి వైద్యం ప్రభుత్వ ధ్యేయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి లో 16లక్షల వ్యయంతో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం చేయడం వల్ల కిష్టం పల్లి,కిషన్ దాస్ పేట ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని పలుమార్లు స్థానిక తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ దంపతులు ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లగా ఎట్టకేలకు ఇట్టి నిర్మాణం కోసం 16 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.

ఈ భూమి పూజ కార్యక్రమంలో గ్రామ స్పేషల్ ఆఫీసర్ సత్తయ్య,జెడ్ పి టి సి చీటీ లక్ష్మణ రావు,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్( MPP Pilli Renuka Kishan Yadav ), సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చేన్ని బాబు, ఎంపీటీసీ ఎనగందుల అనసూయ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ,కాంగ్రెస్ నాయకులు సుడిది రాజేందర్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ,తాజా మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ , గంట బుచ్చయ్య బండారి బాల్ రెడ్డి, మెగి నర్సయ్య తో పాటు కాంట్రాక్టర్ రాడారపు శంకర్ కిష్టం పల్లి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం