రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

సూర్యాపేట జిల్లా:రైతులను ఆదుకోని కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు.

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు రైతు సంఘం జండాను ఆవిష్కరించారు.

అనంతరం పశ్య పద్మ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వామ్య, జమిందారీ,జాగీర్థారీ వ్యవస్థ నిర్మూలనకు రక్షిత కౌలు చట్టం కోసం పోరాటం చేసినందుకు తెలంగాణ రైతు సంఘం తరుపున గర్వపడుతున్నామని పేర్కొన్నారు.

దేశంలో నేటికీ 54 శాతం రైతాంగం వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు.

రైతులు ఆరుగాలం పండించి ప్రజలకు ఆహారం, పరిశ్రమలకు వ్యవసాయోత్పత్తులను అందిస్తున్నారని, అయినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు.

దీని ఫలితంగా ప్రత్యామ్నాయ వృత్తిపై రైతులు ఆలోచిస్తున్నారని,అలాంటి మంచిది కాదని,రైతుల సంక్షేమానికి పాలకులు పెద్ద పీఠ వేయాలని కోరారు.

76 శాతం రైతాంగం వ్యవసాయ రంగాన్ని వదిలి వేయాడానికి సిద్దంగా ఉన్నట్లు 2019 జనవరి సర్వే లో వెల్లడైందని గుర్తు చేశారు.

కార్పోరేట్ శక్తులను పాలకులు ప్రోత్సాహించడం వలన గత రెండు దశాబ్దాలుగా అప్పుల బాధ భరించలేక దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా రైతులు ఆదుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంటను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయని దుయ్యబట్టారు.

జాతీయ గణంకాల ప్రకారం సగటున ప్రతి రైతు కుటుంబానికి 74 వేల అప్పు ఉందని,తెలంగాణ రాష్ట్రంలో 91.

7 శాతం రైతు కుటుంబాలు రుణ భారంతో ఇబ్బందులు పడుతున్నారని,విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు,ఇంధనంతో పాటు వ్యవసాయ ఉపకరణాల ధరలు రెండు ఏళ్లలో రెట్టింపు అయ్యాయని తెలిపారు.

రైతులు పండిస్తున్న అన్ని రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారయణ,సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కంబాల శ్రీనివాస్,రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మూరగుండ్ల లక్ష్మయ్య,దొడ్డ వెంకటయ్య,నాయకులు బొల్లు ప్రసాద్,యల్లావుల రాములు,ఎల్లముల యాదగిరి, బొమ్మగాని శ్రీనివాస్,కంభంపాటి అంతయ్య,సోమల భారతమ్మ,ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు,దోరెపల్లి శంకర్,బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గౌతమ్ తిన్ననూరి ‘కింగ్ డమ్’ రెండు పార్టు లను సక్సెస్ చేస్తాడా..?