ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు సత్వరమే అందించాలి

ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు సత్వరమే అందించాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పరిశ్రమల శాఖ ద్వారా మంజూరైన వివిధ పథకాల ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు అందించాలని అదనపు కలెక్టర్ ఎస్.

ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు సత్వరమే అందించాలి

మోహన్ రావు అన్నారు.శనివారం కలెక్టరేట్ నందు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డి.

ప్రభుత్వ సబ్సిడీని లబ్దిదారులకు సత్వరమే అందించాలి

ఐ.పి.

సి.సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ,వ్యాపార రంగాలలో పలు పథకాలపై ఔత్సాహికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి సమావేశాలు నిర్వహించాలని, లబ్దిదారులందరికి కూడా సబ్సిడీ అందేలా చూడాలని అన్నారు.

జిల్లాలో మంజూరైన వివిధ పథకాలకు సంబంధించి 23 మంది ఎస్సి లబ్దిదారులకు అలాగే ఎస్టి లబ్దిదారులు 90 మందికి సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తద్వారా లబ్దిదారులకు లబ్ది చేకూరుతుందని అన్నారు.

ప్రధాన మంత్రి ఉపాది కల్పన పథకం కింద పరిశ్రమలకు ఖరీదు తయారీ రంగంలో రూ.

25 లక్షల నుండి 50 లక్షల వరకు,అలాగే సర్వీస్ రంగంలో 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచడం జరిగిందని దరఖాస్తులను ఔత్సాహికులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని ఇతర వివరాలకు పరిశ్రమల కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు.

ముఖ్యంగా ట్రేడింగ్ రంగానికి సంబంధించి లైసెన్స్ లను సకాలంలో అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డి.యం.

పరిశ్రమలు తిరుపతయ్య,ఏ.ఓ శ్రీదేవి,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో: డెలివరీ బాయ్ స్కూటర్‌పై విరిగిపడ్డ భారీ చెట్టు.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న వైనం!

వీడియో: డెలివరీ బాయ్ స్కూటర్‌పై విరిగిపడ్డ భారీ చెట్టు.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న వైనం!