ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలి: మాజీ జడ్పీటిసి తండు సైదులు

నల్లగొండ జిల్లా: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఐకెపి సెంటర్లలో పోసిన ధాన్యం తడిసి ముద్దయిందని,ప్రభుత్వం కొనుగోళ్లలో చేస్తున్న అలసత్వం కారణంగానే ఈ పరిస్ఠితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ జెడ్పిటిసి,చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండు సైదులు గౌడ్ అన్నారు.

సోమవారం నల్గొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం కేంద్రంలోని ఐకెపి సెంటర్లను సందర్శించి అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తడసిన ధాన్యానికి పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వహిస్తూ రైతు గిట్టుబాటు ధరను కల్పించి తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీటీసీ బత్తిని మట్టయ్య గౌడ్, బత్తుల సోమరాజు ఆదిమల్ల ప్రసాద్,గడ్డం వెంకట్ రెడ్డి,వంగూరు గిరి,జాకటి సుమన్ వంగూరి కిరణ్,ఆదిమల్ల ప్రశాంత్,తండు నాగరాజు, పోలాగోని సైదులు తదితరులు పాల్గొన్నారు.

కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత..!!