రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి..: కేటీఆర్

తెలంగాణలో ధాన్యం కొనేవారు కరువయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.

తరుగు పేరుతో మూడున్నర కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయాలన్న ఆయన రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు.

ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతుల కోసం పోరాడుతామని వెల్లడించారు.రైతులకు బీఆర్ఎస్( BRS ) అండగా ఉంటుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు.

మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.

పానీ పూరీ తినేముందు క‌చ్చితంగా ఈ విష‌యాలు తెలుసుకోండి!