ప్రభుత్వ కొలువు నల్లగొండ-పని చేసేది పక్క జిల్లాలో

నల్లగొండ జిల్లా:ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం అంటూ వైద్యాధికారుల మందలింపులను సైతం లెక్కపెట్టకుండా ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా విధులకు హాజరుకాకుండా,దర్జాగా ప్రైవేట్ క్లినిక్ నడుపుకుంటూ అటు ప్రభుత్వ సొమ్ము,ఇటు ప్రజల సొమ్ము ఏకకాలంలో దోసేస్తున్న ఓ ఘరానా ప్రభుత్వ వైద్యుని బండారం బట్టబయలైంది.

ప్రభుత్వ కొలువుకి నామం పెట్టి,పేద ప్రజలకు పంగనామం పెట్టి, ఎంచక్కా పక్క జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ ప్రాక్టీస్ పెట్టిన కేతేపల్లి ప్రభుత్వ డాక్టర్ విజయ్ కుమార్ ఆ జిల్లా వైద్యాధికారులు తనిఖీల్లో భాగంగా శనివారం సూర్యాపేటలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కేతేపల్లి మండల ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

విజయ్ కుమార్ కేతేపల్లి సర్కార్ దవాఖానలో ప్రభుత్వ డాక్టర్ గా ఉండి,ప్రజలకు అందుబాటులో లేకుండా,అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ అంతా నా ఇష్టం అన్నట్లుగా ప్రైవేట్ ఆస్పత్రిలో ప్యాక్టిస్ చేస్తున్నాడని మండల ప్రజలు అనేకసార్లు ఆరోపించడం అందరికీ తెలిసిందే.

అతని ప్రవర్తనపై పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీచేసినా సారు వారి బుద్ది మారలేదు.

ఎప్పటిలాగే శనివారం కూడా కేతేపల్లి ప్రభుత్వ దవాఖానకి డుమ్మా కొట్టి సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ గణపతి హాస్పిటల్ లో దర్జాగా ప్యాక్టిస్ చేస్తూ ఓపిలను చూస్తున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు అయ్యగారు ప్రాక్టీస్ చేసే హాస్పిటల్ కి వెళ్ళేసరికి అందులో ఓపిలను చూస్తూ ఉన్నారు.

ఇంకేముంది అసలే అరకొర అనుమతులతో నడుస్తున్న హాస్పిటల్, అందులోనూ ప్రభుత్వ డాక్టర్ ప్రత్యక్షం కావడంతో జిల్లా వైద్యాధికారులు సీరియస్ గా తీసుకొన్నారు.

అతనిపై శాఖాపరమైన చర్యలకు జిల్లా వైద్యాధికారి కోట చలంకి నివేదిక అందజేశారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ కొలువు చేయకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ వెలగబెడుతున్న డాక్టర్ పనితనానికి ఇక సూర్యాపేట జిల్లా అధికారులు చెక్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయిన తేజ..??