అధికారుల నిర్లక్ష్యమే ప్రభుత్వ భూమి ఆక్రమణ కారణం
TeluguStop.com
నల్లగొండ జిల్లా:గత 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం తేరటుపల్లి గ్రామానికి చెందిన 154 మంది ఇల్లులేని పేదలను గుర్తించి,ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకోవడానికి అధికారులు ప్లాట్లను పంపిణీ చేశారు.
కనీస వసతులు,నీటి సౌకర్యం కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేకపోయారు.ఇండ్ల స్థలాల్లో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో వాటర్ ట్యాంక్ నిర్మించడంతో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమై ప్లాట్లకు హద్దులు చూపించాలని పలుమార్లు తహశీల్దార్ కు విజ్ఞప్తి చేశారు.
కానీ,రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఇండ్లకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని ఓ రైతు ఆక్రమించి కబ్జా చేశాడు.
దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని, లబ్ధిదారులు ఇటీవల ప్రజావాణిలో దరఖాస్తులు చేసి,మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణ గురైన ఇళ్ల స్థలాల భూమిని రైతు నుండి కాపాడి ప్లాట్ల ప్రకారం హద్దులు చూపించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మళ్ళీ చండూరు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
అయినా అధికారుల్లో చలనం లేదని వాపోతున్నారు.బాధిత లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా,నిరసన కార్యక్రమాలు చేసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లో నేడు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇండ్లు నిర్మాణం అవుతాయని,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే మాకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున శివ సినిమా ఎంత మందికి లైఫ్ ను ఇచ్చిందో తెలుసా..?