ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం: ప్రజా సంఘాలు

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందనిTUDF రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు విమర్శించారు ఖమ్మం త్రీ టౌన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి, నిర్వహించడం జరిగింది అనంతరం త్రీ టౌన్ ప్రజాసంఘాల కన్వీనర్ భూక్యా శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైనTUDF రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చ లేదన్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అరకొరగా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు ప్రజలందరూ ఆగ్రహంతో డబల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్నారు 57 సంవత్సరాలు పెన్షన్ నేటి వరకు అమలు కాలేద కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేద నిరుద్యోగులకి ఇస్తామన్నా నిరుద్యోగ భృతి నేటికీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్న నాగేశ్వరావు మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యల పైన సర్వే నిర్వహించామన్నారు ఈ సర్వేలో ప్రజల సమస్యలు చాలా మా దృష్టికి రావటం జరిగిందని ఈ సర్వేలలో నివాస ప్రాంతాల్లో సైడ్ డ్రైనేజ్ మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు వేసవికాలంలో ప్రజలకు మంచినీరు లేక చాలా రకమైన సమస్య ఎదుర్కొంటున్నారు తక్షణమే ప్రభుత్వం మంచి నీటి బోరు ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా గొల్లపాడు పనులు లు చాలా నత్తనడకన సాగుతుందన్నారు గొల్లపాడు కాలువలను చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా ప్రభుత్వం గానీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం పనులు నిర్వహిస్తున్నారు గొల్లపాడు పనులు తక్షణమే పూర్తిచేయాలని అదేవిధంగా మున్నేరు ఇరువైపుల కరకట్ట నిర్మాణం చేపట్టాలి మున్నేరు వేటి పైన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల రానున్న రోజుల్లో ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి మరిన్ని పోరాటాలు ప్రభుత్వం పైన నిర్వహిస్తామని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సిఐటియు జిల్లా నాయకులు వై విక్రమ్, టి యు డి ఎఫ్ జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాస్ రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అఫ్రోజ్ సమీనా, సిఐటియు జిల్లా నాయకులు MA జబ్బార్, ఎస్ నవీన్ రెడ్డి, ఆవాజ్ జిల్లా నాయక్ MA ఖయ్యుం గారు, టి యు టి ఎఫ్ నాయకులు బోడ పట్ల సుదర్శన్, 35వ డివిజన్ కార్పొరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు, డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు ఐద్వా త్రీ టౌన్ కార్యదర్శి శ్రీ పత్తిపాక నాగ సులోచన, ప్రజా సంఘాల నాయకులు ఎస్ కే సైదులు సారంగి పాపారావు, రంగు హనుమంత చారి, గబేటి పుల్లయ్య, మద్దెల పుల్లారావు పి రామకృష్ణ, భూక్య సుభద్ర, నాయని నరసింహా రావు మోటమర్రి జగన్మోహన్ రావు, మట్టి పల్లి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, పిరయ్య, రామకృష్ణ, మీనాల మల్లికార్జున్, పాశం సైదమ్మ, జిబి చౌదరి, నాగవరపు లలిత, సునీత ,పునయ, ఎస్కే అమీనా తమ్మినేని రంగారావు పండగ వెంకన్న కన్నా కన్నెగంటి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!