సంతకం పెడతా కానీ.. అలా చేయాలంటూ మహిళా ఉద్యోగికి వేధింపులు.. చివరికి

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ కామాంధులు మాత్రం మారడం లేదు.

అరే మనకు శిక్ష పడుతుందే అన్న భయం వారిలో ఇసుమంతైనా కనిపించడం లేదు.

ఎక్కడ పడితే అక్కడే ఆడవారిని వేధిస్తూ కాల్చుకు తింటున్నారు.చదువుకున్న వారు చదువుకోని వారు అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.

సభ్య సమాజం తలదించుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు.తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన చూసి యావత్ సమాజం షాక్ అయింది.

మెదక్ లోని సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి చేసిన నిర్వాకానికి అంతా కంగుతిన్నారు.

కాంట్రాక్ట్ పద్ధతిలో సంక్షేమ శాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి పట్ల ఆ అధికారి ప్రవర్తన మాత్రం దారుణంగా ఉంది.

ఇటువంటి వారికి అధికారులుగా ఉండే అర్హతే లేదంటూ పలువురు మండిపడుతున్నారు.వెంటనే ఆ కామాంధుడిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారికి ఏడాదికోసారి రెన్యూవల్ పక్కా.పై అధికారుల సంతకం కూడా అందుకు అవసరం.

అదే అవసరమయి ఓ మహిళ అధికారి వద్దకు ఇంకో మహిళతో కలిసి వెళ్లింది.

ఇదే సమయం అనుకుని భావించిన ఆ అధికారి ఇంకో మహిళను బయటకు పంపించేసి బాధిత మహిళను మాత్రమే తన రూంలో ఉంచుకున్నాడు.

"""/" / నీకు నేను సంతకం పెడతా కానీ రేపు మీ ఇంటికి ఓ సారి వస్తాను అని, తన కోరికను తీర్చాలని ఆ మహిళతో చెప్పాడు.

దీనికి ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురయింది.మీకు ఇది న్యాయం కాదని ఆ అధికారిని బతిమలాడింది.

సంతకం కావాలంటే నేను చెప్పినట్లు చేయాల్సిందే అని ఆ అధికారి మహిళకు చెప్పేశాడు.

దీంతో చేసేదేం లేని మహిళ పై అధికారులకు ఫిర్యాదు చేసింది.తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చింది.

ఆ మహిళ మాట్లాడుతూ.తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రకటించింది.

Kattedan Fire Accident : రాజేంద్రనగర్ కాటేదాన్ లో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంటలు