సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

అగ్నిపథ్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యువకులపై కాల్పులు జరపడం దుర్మార్గం.పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

-సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.సూర్యాపేట జిల్లా:దేశ అంతర్గత భద్రతను తాకట్టు పెట్టే విధంగా సైనికులను నియమించడం కోసం కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాదులో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువకులపై పోలీసులు కాల్పులు జరపడం దుర్మార్గమని,పోలీస్ కాల్పుల్లో మరణించిన యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు.

సికింద్రాబాదులో నిరుద్యోగ యువకులపై జరిగిన కాల్పులకు నిరసనగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని సైనిక్ పురి కాలనీలో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని రక్షించడం కోసం సైనిక రంగంలో చేరి దేశానికి సేవ చేయాలని తపన పడుతున్న నిరుద్యోగ యువకులకు నిరాశ మిగిలే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.

ఎన్నో ఆశలతో సైన్యంలో చేరాలనుకున్న యువకుల ఆశలను వమ్ము చేసే విధంగా కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు.

నిన్నటి వరకు కిసాన్లను ఇబ్బంది పెట్టిన కేంద్ర ప్రభుత్వం నేడు జవాన్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని మండిపడ్డారు.

జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని పాతరేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని ఆరోపించారు.

కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమిస్తే దేశంలో ఉగ్రవాద దాడులు,విచ్చిన్నకర శక్తుల ఆగడాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల,మత,ప్రాంతాల పేరుతో దాడులు,దౌర్జన్యాలు చేస్తూ దేశాన్ని సర్వ నాశనం చేయాలని చూస్తుందన్నారు.

ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రయివేటు పరం చేస్తున్న కేంద్రం ఆఖరికి రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటీకరణ చేయాలనే విధానాలను మానుకోవాలని,కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను అరికట్టాలని, అగ్నిపథ్ పథకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,ఎలుగూరి గోవింద్,కోట గోపి, మేకనబోయిన శేఖర్,పులుసు సత్యం,బూర శ్రీనివాస్,సుదర్శన్,వజ్జె శ్రీనివాస్,రణపంగ కృష్ణ, ఉప్పలయ్య,లక్ష్మీ,పిండిగ నాగమణి,మామిడి సుందరయ్య,నగేష్,అబ్బగాని భిక్షం,బోళ్ళ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ?