రేవంత్ రెడ్డి దృష్టికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్య

ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య శుక్రవారం తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చిరకాల స్వప్నమని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల బలమైన ఆకాంక్షనని ఆయన అన్నారు స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ ను తప్పుదోవ పట్టిస్తూ ఇతర కళాశాలలు మంజూరు చేస్తున్నామని ప్రజలను మోసగించడం జరుగుతుందన్నారు.

అలాగే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచుతామని 100 పడకల ఆసుపత్రి చేస్తామని మాట ఇచ్చిన కేటీఆర్ మాట తప్పడం జరిగిందన్నారు మలకపేట రిజర్వాయర్ నుండి 9వ ప్యాకేజీ కింద వచ్చే కాలువ ద్వారా ఇప్పటికీ నీటి సరఫరాను చేయడం లేదన్నారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, నాయకులు మేడిపల్లి రవీందర్ గౌస్,చెరుకు ఎల్లయ్య, శ్రీనివాస్ గౌడ్,చెటుపల్లి బాలయ్య, మాజీ ఎంపిటిసి దేవయ్య, గంగన్న,రమేష్,ఉప సర్పంచ్ మహేందర్,విజయ్ రెడ్డి,చెన్ని బాబు,దండు శ్రీనివాస్,సంతోష్ గౌడ్,పొన్నాల తిరుపతిరెడ్డి, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మూవీ కోసం గుండు గీయించుకున్న సుకుమార్ కూతురు.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!