తిరుమల పవిత్రతను భంగపరిచేలా ప్రభుత్వ నిర్ణయాలు..: ఎంపీ జీవీఎల్

విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో మన దేవాలయం - మన హక్కుపై నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి నియామకంలో తప్పులు జరగడం ఇదేమి మొదటిసారి కాదని ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజకీయ పునరావసం కింద టీటీడీని వినియోగించుకోవడం తీవ్ర తప్పదమన్నారు.టీటీడీ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని మండిపడ్డారు.

తిరుమల పవిత్రతను భంగపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించిన జీవీఎల్ కావాలనే మళ్లీ మళ్లీ తప్పులు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు.

అదేవిధంగా టీటీడీ పాలకమండలి నియామక విషయంలో ఎందుకు పీఠాధిపతులను సంప్రదించడం లేదని ప్రశ్నించారు.

బయట సినిమాల్లోనే నాగార్జునకి మంచి స్కోప్ ఉంటుందా? తెలుగు సినిమాల్లో ఉండదా?