ఆర్టీసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ గా ప్రభులత
TeluguStop.com
ఆర్టీసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రిజినల్ మనేజర్ గా ప్రభులత
నూతనంగా బాధ్యతలు చేపట్టారు అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్ ఎం ప్రభులత కు పలు సూచనలు చేశారు.
ఖమ్మం నూతన ఆర్టీసి బస్ స్టాండ్ నందు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు
ఖమ్మంకు మణిహారం ఉన్న బస్ స్టాండ్ లో ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
ఖమ్మం నగర పరిధిలో అవసరం ఉన్న ప్రతి చోటుకు సిటీ బస్సులు తిరగాలని ఆదేశించారు.
సర్వీస్ లు అవసరం అయితే పెంచాలన్నారు.పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న రీజినల్ మేనేజర్ కార్యలయంను నూతన బస్ స్టాండ్ లోనే మొదటి అంతస్తుకు మార్చాలన్నరు.
అందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు.కార్యక్రమంలో ఖమ్మం డిపో మేనేజర్ శంకర్ రావు ఉన్నారు.