Bhadrachalam : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పాలకమండలి సమీక్షా సమావేశం
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం( Bhadrachalam ITDA Office )లో పాలకమండలి సమీక్షా సమావేశం కొనసాగుతోంది.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Tummala Nageswara Rao ) మాట్లాడుతూ గురుకులాలు, ఆశ్రమ పాఠశాల భవనాలను పరిశీలించాలని తెలిపారు.
శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే కూల్చివేయాలని చెప్పారు.శిథిలమైన భవనాల్లో విద్యార్థులను కూర్చోపెట్టొద్దని సూచించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న మొదటి సమావేశం ఇదేనన్న సంగతి తెలిసిందే.
రెండేళ్ల తర్వాత గూగుల్ స్ట్రీట్ వ్యూలో భార్య ఆచూకీ.. చివరికేమైందో తెలిస్తే..?