మళ్లీ కనిపించబోతున్న గౌతమ్... కన్విన్సింగ్‌గా ఉన్న కారణం
TeluguStop.com
మహేష్ బాబు తనయుడు గౌతమ్ మూడు నాలుగు సంవత్సరాల క్రితమే '1' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.
ఆ చిత్రంలో గౌతమ్ చాలా సమయం కనిపిస్తాడు.కాని పూర్తి స్థాయి నటుడిగా మాత్రం ఆ చిత్రంలో కనిపించలేదు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం ఆకట్టుకోలేక పోయింది.మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో గౌతమ్ మళ్లీ సినిమా చేసేందుకు మహేష్ బాబు ఆసక్తి చూపలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు గౌతమ్‌ను వెండి తెరపై చూపించేందుకు మహేష్ బాబు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు 25వ చిత్రం మహర్షిలో గౌతమ్ కనిపించబోతున్నాడట.
మహేష్‌బాబుకు అది ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో పాటు బెంచ్ మార్క్ చిత్రంగా మహర్షి నిలుస్తుంది.
అందుకే మహేష్ బాబు 25వ చిత్రంలో గౌతమ్ ఉండాలని వంశీ పైడిపల్లి కూడా భావించాడట.
అందుకే గౌతమ్‌ను ఈ చిత్రంలో కొన్ని నిమిషాల పాటు చూపించాలని మహేష్‌బాబు కూడా భావించాడు.
ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడంతో గౌతమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తే తప్పకుండా మంచి పేరును గుర్తింపును దక్కించుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.
త్వరలోనే సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న 'మహర్షి' చిత్రం విడుదల మే 9కి ఫిక్స్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను చేస్తున్నారు.
రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.
మహేష్ బాబుకు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటించింది.అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా భారీగా బిజినెస్ చేస్తోంది.
ఎట్టకేలకు పుష్ప సినిమాకు విష్ చేసిన మెగా హీరో.. బన్నీ రిప్లై ఇస్తాడా?