శివసేన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునిగా గౌటే గణేష్ నియామకం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ కోర్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ తదితరులు తెలంగాణ కోర్ కమిటీ సభ్యుని నియామక పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కోర్ కమిటీ సభ్యులు ఐదుగురు ఉంటారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
కార్యక్రమంలో శివసేన పార్టీ కమిటీ సమావేశం జరిగింది.శివసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి మరిన్ని సమావేశాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
శివసేన పార్టీ కోర్ కమిటీ సభ్యునిగ తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించడం పట్ల గౌటే గణేష్ సంతోషం వ్యక్తం చేశారు.
శివసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.గౌటే గణేష్ నియామకం పట్ల గంభీరావుపేట మండలంలో పలువురు నాయకులు వర్షం వ్యక్తం చేశారు.
అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?