పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు… అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు…

దినపత్రికలు అనేవి నిజానికి నిలువుటద్దంలాగా ఉండాలి.కానీ నేటి దినపత్రికలు అనేవి అబద్ధాన్ని అదేపనిగా ప్రసారం చేసుకుంటూ పోతున్నాయి.

ఒకటీ అరా పత్రికలూ తప్పితే మొదటినుండి అబద్ధపు జర్నలిజమే రాజ్యమేలుతోంది.ఇవి ఎప్పుడూ.

రాజకీయ, సినిమా నేపధ్యం ఉన్నవారి జీవితాలమీద ఫోకస్ పెడుతూ.వున్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాయి.

అలాంటి ఘటనే తమిళనాడులో ఒకసారి జరిగింది. """/" / విషయంలోకి వెళితే.

2009లో జరిగిన పాపులర్ సంఘటన ఇది.నటి భువనేశ్వరి( Bhuvaneswari ) గురించి మీరు వినే వుంటారు.

తమిళంలో శంకర్ తీసిన ‘బాయ్స్’ సినిమా( Boys )లో వేశ్య పాత్ర ద్వారా ఆమె ఇరు తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.

ఈ క్రమంలోనే ఆమె తెలుగులో ‘దొంగరాముడు అండ్ పార్టీ’, ‘గుడుంబా శంకర్’, ‘చక్రం’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’, ‘ఆంజనేయులు’వంటి సినిమాలతో బాగా ప్రాచుర్యం పొందారు.

ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తుందన్న నెపంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న ఆమె ఇంటికి వచ్చీపోయే జనాలు అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 2009 అక్టోబర్‌ 3న పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి, వ్యభిచార గృహం నడుపుతుందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేయడం జరిగింది.

"""/" / ఈ నేపథ్యంలో పోలీసులు చేసిన విచారణలో ఆమె, “నేనొక్కదాన్నే చేస్తున్నానా? సినిమా పరిశ్రమలో చాలామంది ఉన్నారిలా?” అంటూ కొన్ని పేర్లు బయటపెట్టడంతో అక్టోబర్ 4న ‘దినమలర్’ అనే తమిళ పత్రిక ఈ వార్తను చాలా సీరియస్ గా తీసుకొని ప్రచురించింది.

‌ దాన్ని కేవలం ఒక వార్తగా రాయకుండా భువనేశ్వరి ఎవరి పేర్లయితే చెప్పారో, ఆ నటీమణుల ఫొటోలతో సహా ప్రచురితమైంది.

కట్ చేస్తే తమిళనాడు రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఆ ఘటనతో ఉలిక్కిపడింది.వెంటనే నడిగర్ సంగం రంగంలోకి దిగింది.

అప్పట్లో నడిగర్ సంగానికి నటుడు శరత్‌‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.ఈ విషయాన్ని ఆయనతోపాటు తోటి నటులంతా సీరియస్‌గా తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసి నిరాధారమైన ఇలాంటి వార్త ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్‌ని అరెస్టు చేయించాలని కోరారు.

దాంతో స్త్రీల గౌరవం దెబ్బ తీశారనే అభియోగంతో ‘దినమలర్( Dinamalar )’ పత్రిక ఎడిటర్ లెనిన్‌ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆ పత్రికవారు బహిరంగంగా క్షమాపణ చెప్పి, పత్రికలో ‘క్షమాపణ’ వార్త ప్రచురించారు.

తరువాత కొన్నాళ్ళకి ఈ అంశం సమసిపోయింది.ఇక నటి భువనేశ్వరి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.

‘తాను ఎవరి పేర్లూ చెప్పలేదని, ఎవరితోనూ తానేమీ మాట్లాడలేదని’ బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

కానీ అప్పటికీ చేయి దాటిపోయింది.లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ, ఆ సంఘటన తమిళ చిత్ర పరిశ్రమలో హేమాహేమీలను కంటిమీద కునుకులేకుండా చేసింది.

ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..?