అఖండ మూవీ సీక్వెల్ లో బాలయ్యతో పాటు పవన్.. వైరల్ వార్తలో నిజమెంత?
TeluguStop.com
ఏంటి.నిజమా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య బాబు( Balayya Babu ) అలాగే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారట.
ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అలాగే ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరూ సీనియర్ స్టార్ హీరోలు ఇలా అనేక అంశాలు అభిమానులలో ఆశలను పెంచేస్తున్నాయి.
ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు డిప్యూటీ సీఎం.ఇంతకీ ఆ సినిమా ఏది అన్న విషయానికి వస్తే.
నందమూరి నరసింహ బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారట.
"""/" /
ఆ సినిమా అఖండ 2( Akhanda 2 ) అని తెలుస్తోంది.
గత ఏడాది సంక్రాంతి బరిలో వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలయ్య వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడట.
సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2ను ఈ మధ్యే గ్రాండ్ లాంచ్ చేశారు బాలయ్య.
అందులో డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పెషల్ రోల్( Pawan Kalyan Special Role ) చేయనున్నట్లు తెలుస్తోంది.
అఖండ 2లో బాలయ్య పాత్రకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.ఇందులో బాలయ్య దేవాలయాల పవిత్రతను కాపాడే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
"""/" /
అంతేకాదు హిందూ గ్రంధాల జోలికి వచ్చి వాటిని అవహేళన చేసేవారి పని పడతాడట.
అఖండ సినిమాలో బాలయ్య బాబు అఘోర లుక్ లో ఆడియన్స్ ను అలరించారు.
అఖండ 2లో కూడా పవర్ ఫుల్ రోల్ లో అలరిస్తారని తెలుస్తోంది.ఇందులో పవన్ కల్యాణ్ కూడా బాలయ్యతో కలసి నటించబోతున్నాడట.
పవన్ కల్యాణ్,బాలయ్య ఇద్దరు ఇంటర్వెల్ సమయంలో ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని ఆ సీన్ వేరే లెవల్ లో ఉంటుందని తెలుస్తోంది.
బాలయ్య, పవన్ ఒకే సీన్ లో కనిపించే టైమ్ లో వచ్చే Bgm కు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు.
అటు బాలయ్య, ఇటు పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, ఆదివారం 2024