గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలా చేయని పక్షంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదని స్పష్టం చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసేది లేదని తెలిపారు.గతంలో రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా రెండు సార్లు బీజేపీ తరపు నుంచి పోటీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
గత సంవత్సరం మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో పార్టీ ఆయనను బహిష్కరించింది.
ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు.. సూపర్ స్టార్ మహేష్ రియాక్షన్ ఇదే!