గోశాలలో కోడెలకు సకల వసతులు
TeluguStop.com
అధునాతన పద్ధతుల్లో షెడ్లు నిర్మాణం జీవాలకు మేలైన దాణా, పచ్చగడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలల్లో అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్ లోని గోశాలలో ఆలయ నిధులు రూ.
61 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి, ప్రభుత్వ విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శనివారం భూమి పూజ చేశారు.
అనంతరం అదే ఆవరణలో రూ.66 లక్షలతో నిర్మించిన మూడు షెడ్లను ప్రారంభించారు.
అక్కడి నుంచి నేరుగా వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో రూ.
50 లక్షల అంచనాలతో రెండు షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.వన మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఆలయ ఈఓ కలిసి నాటారు.
అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు.వేములవాడ రాజన్న ఆలయంలో ఆ స్వామి వారికి కోడే మొక్కు చెల్లించడం అత్యంత ప్రీతి పాత్రమైనదని వివరించారు.
చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలను తీర్చు తండ్రి అని ఎంతో ఇష్టంగా స్వామి వారికి కోడే మొక్కులను చెల్లించుకుంటారని, గోవులకు కోసం అధునాతన పద్ధతులలో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.
సీఎం, దేవాదాయ శాఖ మంత్రి సూచనలతో కలెక్టర్ తో కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడలను పేద రైతులకు అందించామని గుర్తు చేశారు.
కోడెలకు అధునాతన వైద్యం అందిస్తూ, నాణ్యమైన దాణా, పచ్చి గడ్డి అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
వన మహోత్సవంలో భాగంగా ఆలయ సువిశాల ప్రాంగణంలో మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
దేవాలయానికి అనుబంధమైన చెట్లను ఎంపిక చేసుకొని వాటిని నాటడం జరుగుతుందని వివరించారు.రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, దానికి నిదర్శనమే మొన్నటి బడ్జెట్లో 50 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు త్వరలో శృంగేరి పీఠానికి వెళ్లి వారి అనుమతితో ఆలయ విస్తరణ చేపడతామని పేర్కొన్నారు.
కార్యక్రమాలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్,వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
దేవర కలెక్షన్స్ నిజమేనా అనే ప్రశ్నకు నాగవంశీ జవాబిదే.. ఆయనేం చెప్పారంటే?