మీసం తిప్పిన సీఐ ... ఎంపీ టికెట్ ఇవ్వబోతున్న జగన్ ..?

అవకాశాలు అనేవి ఒక్కోసారి ఎంత వెతికినా రావు.కానీ కొంతమందికి ఒక్కోసారి అవి వెతుకుంటూ వస్తాయి అనే దానికి ఉదాహరణగా.

ఓ పోలీస్ అధికారి నిలుస్తున్నాడు.అతని మాట తీరు.

తెగువ ఇవన్నీ వైసీపీ అధినేత జగన్ ను ఆకర్షించడంతో అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి సంచలనం సృష్టించాలని జగన్ భావిస్తున్నాడు.

ఇంతకీ విషయం ఏంటి అంటే.కొద్ది నెలల క్రితం ప్రభోధానంద అనే స్వామిజీ ఆశ్రమం విషయంలో.

పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన విమర్శలకు ఓ సీఐ గట్టిగా బదులు చెప్పాడు.

అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో గోరంట్ల మాధవ్ ఆ సీఐ జేసీని నాలుక కోస్తా అంటూ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఒక ఎంపీ అందునా పవర్ ఫుల్ లీడర్ అయిన జేసీ దివాకరరెడ్డి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చూసి అంతా ఔరా అనుకున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒక సీఐ స్థాయి అధికారి ఇలా వ్యాఖ్యానించడానికి ఎంత ధైర్యం కావాలి అంటూ.

చర్చలు కూడా జరిగాయి.ఇవి వైరల్ అవ్వడంతో ఆ సీఐ కాస్తా ఫేమస్ అయిపోయాడు.

ఇంకేముందు కట్ చేస్తే.ఇప్పుడు ఆ సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు.

అంతే కాదు మరి కొద్ది రోజుల్లో వైసీపీ లో కూడా చేరబోతున్నాడట.ప్రస్తుతం కదిరి అర్బన్ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి గారికి అందజేశారు.

డిఎస్పీ ఆలేఖ ను జిల్లా ఎస్పీ ఙీవీజీ అశోక్ కుమార్ కు పంపారు.

ఇక రాజీనామా ఆమోదించడం ఒక్కటే మిగిలి ఉంది.ఇక అయన వైసీపీలోకి వెళ్లడం దాదాపు ఫిక్స్ అయిపోవడంతో.

ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతోనూ.జగన్ తోనూ పలుదఫాలుగా.

చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ చర్చల్లో భాగాంగా.

ఆయనకు అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ టిక్కెట్ ఇస్తామని.జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్లారిటీ రావడంతోనే అయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారని సమాచారం.అసలు ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్దపడడానికి ప్రధాన కారణం.

జేసీ దివాకర్ రెడ్డిపై సీఐ మాధవ్ విరుచుకుపడిన తీరు జగన్‌కు బాగా నచ్చడమేనట.

అందుకే.ఆయనను పార్టీలోకి తీసుకుని అటు జేసీకి కూడా ఝలక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడట.

ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ స్థానానికి నదీమ్ అనే వ్యక్తి ఇంఛార్జిగా ఉన్నారు.కానీ ఆయన అక్కడ సరైన అభ్యర్థి కాదు అనే ఉద్దేశంతోనే.

మాధవ్ ను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది.

సంధ్య థియేటర్ కు భారీ షాక్.. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదంటూ?