Gorantla Butchaiah Chowdary : రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు..!!

నేడు తెలుగుదేశం.జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.

టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక వేదికపై నుండి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.

పొత్తులో భాగంగా జనసేన పార్టీకి( Janasena ) 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించడం జరిగింది.

టీడీపీకి( TDP ) 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ల పేరు లేకపోవడం సంచలనంగా మారింది.

ఈ విషయంలో టీడీపీ సీనియర్ రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary ) పేరు ఎప్పటినుండో వినిపిస్తోంది.

ఈసారి ఆయనకు టికెట్ వచ్చే అవకాశం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. """/" / పరిస్థితి ఇలా ఉంటే తొలి జాబితా ప్రకటించిన అనంతరం గోరంట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి రూరల్ సీట్( Rajahmundry Rural Seat ) తనదేనని చంద్రబాబు చెప్పినట్లు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో తన గెలుపు తథ్యం అని స్పష్టం చేశారు.జాబితాలో తన పేరు ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన తరఫున రాజమండ్రి రూరల్ టికెట్ ప్రకటించలేదని వివరించారు.

జనసేన నాయకులను ఒప్పించిన తరువాతే సీటు ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఇవాల్టి జాబితాలో రాజమండ్రి రూరల్ నీ ఆపారని పేర్కొన్నారు.

టికెట్లు ఎవరికిచ్చిన కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.మరోపక్క రాజమండ్రి రూరల్ స్థానం టికెట్ కోసం జనసేన నాయకుడు కందుల దుర్గేష్ కూడా రేసులో ఉన్నారు.

దీంతో కూటమిలో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ ఎవరికీ కేటాయిస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై నల్లటి మచ్చలు మాయం అవ్వాలా.. అయితే ఈ రెమెడీని ప్రయత్నించండి!