Gopichand VV Vinayak : గోపిచంద్ వి వి వినాయక్ కాంభినేషన్ లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదట విలన్ గా పరిచయమైన గోపీచంద్.( Gopichand ) తనదైన విలనిజంతో తనలోని ఒక నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఆయన చేసిన విలన్ పాత్రలు అతనికి మంచి గుర్తింపుని తీసుకురావడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కూడా కల్పించాయి.
ఇక ఇలాంటి సమయంలో ఆయన 'యజ్ఞం ' అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
"""/" /
అలాంటి గోపీచంద్ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో స్టార్ హీరో రేంజ్ లో ఉండాల్సిన ఆయన మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ స్టార్ డైరెక్టర్ అయిన వి వి వినాయక్( VV Vinayak ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది.
కానీ అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది.గోలీమార్ సినిమాతో( Golimaar ) సూపర్ సక్సెస్ ని అందుకున్న తర్వాత గోపిచంద్ వినాయక్ కాంబో లో ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ మెంట్ కూడా చేశారు.
అయినప్పటికీ ఆ సినిమా అనుకోని కారణాలవల్ల పట్టాలైతే ఎక్కలేదు.గోపీచంద్ మాస్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.
"""/" /
కాబట్టి మాస్ డైరెక్టర్లకు ఆయన చాలా బాగా సెట్ అవుతాడు.
ముఖ్యంగా వి వి వినాయక్, బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్లకు ఆయన కటౌట్ అయితే బాగా సెట్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇక మొత్తానికైతే వినాయక్ డైరెక్షన్ లో ఒక సినిమా మిస్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఆయన శ్రీను వైట్ల( Srinu Vaitla ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ఈ సినిమాతో ఏదో ఒక మ్యాజిక్ అయితే చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025