ఫ్లాప్ టాక్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించిన విశ్వం.. గోపీచంద్ కే సాధ్యమంటూ?

గత కొంతకాలంగా గోపీచంద్( Gopichand ) సినీ కెరియర్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి.

గోపీచంద్ నటిస్తున్న ప్రతి ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వస్తున్నాయి.

పదేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూనే ఉన్నాయి.అయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.

ఇటీవల గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల విశ్వం సినిమా( Viswam )ను రూపొందించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

గతంలో తాను చేసిన తప్పులను సరిదిద్దుకుని ఈ సినిమాను రూపొందించా అంటూ ప్రమోషన్ సమయంలో కూడా చెప్పుకొచ్చారు.

అలాగే విశ్వం తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని యూనిట్‌ సభ్యులు ప్రెస్‌మీట్‌ లో ఊదరగొట్టారు.

"""/" / విడుదల సమయంలో రివ్యూలు పర్వాలేదు అన్నట్లు వచ్చాయి.అలాగే ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఒక మోస్తరుగా వచ్చాయి.

సినిమాను అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా రూ.15 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగిందని తెలుస్తోంది.

మొదటి వీకెండ్‌ లో సినిమా సాధించిన వసూళ్లు కేవలం రూ.3.

15 కోట్ల షేర్‌ అని టాక్.సినిమా బ్రేక్ ఈవెన్‌ కి రూ.

15 కోట్లు కావాల్సి ఉండగా మొదటి వారం రోజులు పూర్తి అయ్యేప్పటికి కేవలం రూ.

5 కోట్ల షేర్ లోపు మాత్రమే వచ్చిందనే తెలుస్తోంది.లాంగ్‌ రన్‌లో సినిమాకు మరో రెండు మూడు కోట్ల షేర్‌ రావడం గొప్ప విషయం అని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

"""/" / అయితే వచ్చే వారంలో ఎంత గొప్పగా విశ్వం సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించినా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మాత్రం సాధ్యం కాదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

విశ్వం కొనుగోలు చేసిన బయ్యర్లకు రక్త కన్నీరు తప్పదని కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి చాలా దూరంగా ఉంది.అయినా నిర్మాతలు మాత్రం సూపర్‌ హిట్‌ అంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, సక్సెస్ మీట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీను వైట్ల( Srinu Vaitla ) చేస్తున్న ఈ హడావిడిని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో ఆయనే ఒక సినిమాలో కొందరు సినిమా హిట్‌ కాకున్నా సక్సెస్‌ మీట్‌ లు చేస్తారు అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఇప్పుడు ఆయనే తన సినిమా బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంగా ఉన్నా అప్పుడే హిట్‌ కొట్టింది అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వం సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఖర్చు చేయడంతో పాటు, అంచనాలు పెంచి ఎక్కువ మొత్తంకు అమ్మడం జరిగింది.

దాంతో ఇప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరెంజ్ పండ్ల‌తో క‌లిపి వీటిని పొర‌పాటున కూడా తీసుకోకూడ‌దు..తెలుసా?