ఓటీటీ లో ‘భోళా శంకర్’ ని డామినేట్ చేస్తున్న గోపీచంద్ ‘రామబాణం’

ఓటీటీ లో ‘భోళా శంకర్’ ని డామినేట్ చేస్తున్న గోపీచంద్ ‘రామబాణం’

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో నిర్మాతలకు బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిన చిత్రాలలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'భోళా శంకర్( Bhola Shankar )'.

ఓటీటీ లో ‘భోళా శంకర్’ ని డామినేట్ చేస్తున్న గోపీచంద్ ‘రామబాణం’

మెహర్ రమేష్ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఎన్నడూ చూడని రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

ఓటీటీ లో ‘భోళా శంకర్’ ని డామినేట్ చేస్తున్న గోపీచంద్ ‘రామబాణం’

ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ నుండి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము.

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది.

అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి కి ఇలాంటి పరాభవం రావడం దురదృష్టకరం.

మెహర్ రమేష్ ని నమ్మడమే చిరంజీవి చేసిన అతి పెద్ద పొరపాటు అని అంటున్నారు ఫ్యాన్స్.

"""/" / ఇకపోతే ఈ సినిమాని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.

తెలుగు వెర్షన్ తో పాటుగా హిందీ వెర్షన్ ని కూడా కలిపి విడుదల చేసారు.

కనీసం ఓటీటీ లో అయినా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నచ్చుతారేమో అని అనుకున్నారు ఫ్యాన్స్.

కానీ ఓటీటీ లో కూడా ఈ సినిమాకి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది.ఇలాంటి స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమాలను నా చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము, కనీసం రోత స్క్రీన్ ప్లే తో సాగే చిత్రాన్ని కూడా సరిగా తియ్యలేకపోయాడు మెహర్ రమేష్, ఇంత పనికిమాలిన డైరెక్టర్ ని మేము ఇప్పటి వరకు చూడలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ బండబూతులు తిడుతున్నారు.

మరో విషయం ఏమిటంటే రీసెంట్ గానే గోపీచంద్ హీరో గా నటించిన 'రామబాణం( Ramabanam )' చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన ఈ చిత్రానికి ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

"""/" / ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో 'భోళా శంకర్' కంటే టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.

భోళా శంకర్ హిందీ వెర్షన్ కి 'రామ బాణం' కంటే తక్కువ వ్యూస్ వచ్చాయి.

మెగాస్టార్ లాంటి హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా శోచనీయం.

రీ ఎంట్రీ తర్వాత మూడు సార్లు వంద కోట్లు కొట్టిన హీరో కి అటు థియేట్రికల్ పరంగా, ఇటు డిజిటల్ పరంగా ఆడియన్స్ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసారు.

ఇలాంటి ఫ్లాప్ తర్వాత చిరంజీవి ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 'భింబిసారా' డైరెక్టర్ వసిష్ఠ తో( Mallidi Vasishta ) ఒక సినిమా చేస్తున్నాడు.

నవంబర్ నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది, ఈ సినిమాతో కచ్చితంగా మెగాస్టార్ రీసౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పనామాలో భారతీయుల అవస్థలు