గోపీచంద్ ‘రామబాణం’ ప్రివ్యూ
TeluguStop.com
యాక్షన్ హీరోగా గోపీచంద్( Gopichand ) కమర్షియల్ గా సక్సెస్ ని దక్కించుకుని చాలా కాలం అయ్యింది.
అయినా కూడా అదృష్టం కొద్ది వరుసగా సినిమా ల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
తాజాగా రామబాణం( Rama Banam ) సినిమాలో గోపీచంద్ నటించాడు.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి శ్రీ వాస్ ( Sriwass )దర్శకత్వం వహించాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో రూపొందిన ఈ సినిమా కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.
లక్ష్యం మరియు లౌఖ్యం సినిమాలు గోపీచంద్ మరియు శ్రీవాస్ కాంబోలో వచ్చిన విషయం తెల్సిందే.
"""/" / ఈ సినిమా తో మూడవ సారి ప్రేక్షకుల ముందుకు ఈ కాంబో రాబోతున్నారు.
హ్యాట్రిక్ దక్కించుకుంటాం అంటూ దర్శకుడు మరియు హీరో చాలా నమ్మకంగా ఉన్నారు.కానీ పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం జనాలు ఎంత వరకు సినిమా ఆధరిస్తారో క్లారిటీ రావడం లేదు.
డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ లు ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.
పైగా ఈ సినిమా ఎప్పుడో ప్రారంభించారు. """/" /
దర్శకుడు మరియు హీరో మధ్య విభేదాల కారణంగా ఆలస్యం అయ్యింది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఆ విషయమై క్లారిటీ లేదు.మొత్తానికి విడుదలకు ముందు ఏం జరిగినా కూడా విడుదల తర్వాత జరుగబోతున్న విషయాలపైనే అందరి దృష్టి ఉంటుంది.
సినిమా కోసం ఎంత కష్టపడ్డా కూడా అది సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ కష్టం అంతా కూడా మర్చి పోవచ్చు.
"""/" / ఇప్పుడు రామబాణం చిత్ర యూనిట్ సభ్యులు సినిమా పై నమ్మకంగా కనిపిస్తున్నారు.
ఈ సినిమా కు నందమూరి బాలకృష్ణ టైటిల్ ను సూచించడం వల్ల జనాల్లో వార్తగా నిలిచింది.
దాంతో రామబాణం చిత్రం మరో లెవల్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఫలితం ఏంటి అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వీడియో వైరల్: ఒకే వేదికపై సచిన్, వినోద్ కాంబ్లీ.. సచిన్‌ను చూడగానే?