Gopichand Movies : గోపీచంద్ నటించిన ఆ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యేవా?
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్( Gopichand ) నటించిన భీమా ( Bhimaa ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
దర్శకుడు కథ రాసుకున్న సమయంలోనే టైటిల్ ఫిక్స్ చేశాడని శివుడి మీదే ఈ సినిమ మొదలవుతుందని శివుడి మీదే ఈ సినిమా పూర్తవుతుందని గోపీచంద్ కామెంట్లు చేశారు.
శివుడికి మరో పేరు భీమా అని ఆయన తెలిపారు.హర్ష రివర్స్ స్క్రీన్ ప్లే బాగా రాశారని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానని ఆయన వెల్లడించారు.
నా కొడుకులలో ఒక్కడినైనా డైరెక్టర్ చేయాలని ఉందని పెద్దోడు సినిమాలు బాగా చూస్తాడని గోపీచంద్ వెల్లడించారు.
టైటిల్ చివర్లో సున్నాలు ఉండటం సెంటిమెంట్ కాదని అవన్నీ అలా కుదిరాయని ఆయన తెలిపారు.
"""/" /
శ్రీనువైట్ల( Srinu Vaitla ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ 30 శాతం పూర్తైందని శ్రీనువైట్ల స్టైల్ లో ఈ సినిమా ఉంటుందని గోపీచంద్ పేర్కొన్నారు.
16 రోజుల పాటు అడవిలో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశామని ఆయన అన్నారు.
రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివానని గోపీచంద్ వెల్లడించారు.నా కెరీర్ లో నాకు బాగా నచ్చిన మూవీ ఒక్కడున్నాడు( Okkadunnadu ) అని ఆ సినిమాను ఇప్పుడు తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని ఆయన అన్నారు.
గౌతమ్ నంద సినిమాకు( Goutham Nanda ) కూడా ఆశించిన సక్సెస్ దక్కలేదని వెల్లడించారు.
"""/" /
ఒక్కడున్నాడు, గౌతమ్ నంద ఇప్పుడు రిలీజై ఉంటే ఆ సినిమాల ఫలితం మారేదేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భగత్ సింగ్ బయోపిక్ లో నటించాలని ఉందని గోపీచంద్ అభిప్రాయపడ్డారు.సాహసం మూవీ రీరిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన కామెంట్లు చేస్తున్నారు.
సైకిల్ వేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయని గోపీచంద్ పేర్కొన్నారు.
పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?