సెట్స్ పైకి వెళ్తున్న గోపీచంద్, తేజ కాంబినేషన్... హిట్ పడాల్సిందే

సెట్స్ పైకి వెళ్తున్న గోపీచంద్, తేజ కాంబినేషన్… హిట్ పడాల్సిందే

చిత్రం సినిమాతో దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన తేజ కెరియర్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకొని కొత్తవాళ్లతో సినిమాలు తీసి సక్సెస్ అయిన దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సెట్స్ పైకి వెళ్తున్న గోపీచంద్, తేజ కాంబినేషన్… హిట్ పడాల్సిందే

అయితే తరువాత అతని కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా రావడంతో అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

సెట్స్ పైకి వెళ్తున్న గోపీచంద్, తేజ కాంబినేషన్… హిట్ పడాల్సిందే

అదే సమయంలో కుటుంబ సమస్యల కారణంగా సినిమాలకి కొంత కాలం దూరం అయ్యారు.

తరువాత రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన దర్శకుడు తేజ సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాతో తర్వాత నెక్స్ట్ కొత్తవాళ్లతో సినిమాలు తీయనని తేజ స్పష్టం చేసేసారు.

ఆ తరువాత బెల్లంకొండ, కాజల్ తో కాంబినేషన్ లో సీత అనే సినిమా తీశాడు.

అయితే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.ఈ నేపధ్యంలో నెక్స్ట్ సినిమా కోసం గ్యాప్ తీసుకున్న తేజ తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమాని ఒకే చేసుకున్నట్లు తెలుస్తుంది.

గోపిచంద్ కి కెరియర్ లో జయం, నిజం సినిమాలతో విలన్ గా మంచి కెరియర్ ఇచ్చాడు.

ఆ ఫ్లాట్ ఫాంతో గోపీచంద్ మరల హీరోగా టర్న్ తీసుకొని కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో నిలబడ్డాడు.

అయితే ఈ మధ్య కాలంలో గోపిచంద్ కూడా వరుస ఫ్లాప్స్ తో ఉన్నాడు.

ఇలాంటి టైం లో తేజ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్న గోపిచంద్.