నా మనవడు ఏ నిమిషంలో చనిపోతాడో తెలీని పరిస్థితి.. ఈ నటుడు ఇన్ని కష్టాలు పడ్డారా?
TeluguStop.com
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో గోపరాజు రమణ ఒకరు.
ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటుడు పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గోపరాజు రమణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అంటే సుందరానికి సినిమా, నరేష్ సినిమా, మరికొన్ని సినిమాలు మిస్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.
కరోనా వల్ల ఆలస్యంగా మొదలు కావాల్సిన సినిమాలు త్వరగా మొదలవుతున్నాయని త్వరగా మొదలు కావాల్సిన సినిమాలు ఆలస్యంగా మొదలవుతున్నాయని గోపరాజు రమణ చెప్పుకొచ్చారు.
నేను ఖాళీగా ఉన్న సమయంలో డేట్లు ఇస్తానని అన్నానని ఆ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్లు క్లాష్ కావడం వల్ల ఇబ్బందులు వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు.
"""/" /
మన లాభం కోసం అవతలి వాళ్లకు ఇబ్బంది కలగకూడదని నేను భావిస్తానని ఆయన పేర్కొన్నారు.
రెమ్యునరేషన్( Remuneration ) మరీ తక్కువగా ఇస్తామని చెబితే ఏం చేయగలమని గోపరాజు రమణ చెప్పుకొచ్చారు.
మా చిన్నబ్బాయికి ఒక బేబీ, బాబు పుట్టారని బాబు పుట్టిన మూడో రోజు చనిపోయాడని ఆయన కామెంట్లు చేశారు.
బాబు లేడని దిగులు ఉండేదని గోపరాజు రమణ( Goparaju Ramana ) అన్నారు.
ఆ తర్వాత మళ్లీ కొడుకు పుట్టాడని కానీ ఆ బాబు బ్రతకడం కష్టమని అన్నారని గోపరాజు రమణ అన్నారు.
"""/" /
నా మనవడికి మూడు హార్ట్ ఆపరేషన్లు చేయాలని చెప్పారని, హార్ట్ కూడా కావాలని చెప్పారని ఆయన అన్నారు.
ఈ చికిత్స కోసం భారీ స్థాయిలో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని ఆయన తెలిపారు.
ఒక ఆస్పత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీ( Aarogyasri ) కింద చికిత్స చేశామని చెప్పి ఆ తర్వాత చేయలేదని గోపరాజు రమణ అన్నారు.
2018లో నా మనవడికి మొదటి ఆపరేషన్ జరిగిందని ఆయన తెలిపారు.ఆపరేషన్ల కోసం 18 లక్షలు ఖర్చైందని ప్రస్తుతం నా మనవడు సేఫ్ అని గోపరాజు రమణ పేర్కొన్నారు.
మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…