పురుషులను వేధిస్తున్న బ్లాక్ హెడ్స్.. ఉసిరితో చెక్ పెట్టండిలా!
TeluguStop.com
బ్లాక్ హెడ్స్.చాలా మందిని వేధిస్తున్న కామన్ చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
ఆయిలీ స్కిన్ ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.ఈ బ్లాక్ హెడ్స్ సమస్యను కేవలం ఆడవారే కాదు.
పురుషులు కూడా ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు.అయితే అమ్మాయిలు ఏదో ఒక విధంగా బ్లాక్ హెడ్స్‌ను నివారించుకుంటారు.
కానీ, అబ్బాయిలు మాత్రం ఏం చేయాలో తెలియక వాటిని పట్టించుకోవడం మానేస్తారు.ఫలితంగా, బ్లాక్ హెడ్స్ మరింత ఎక్కువైపోతాయి.
దీంతో ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.బ్లాక్ హెడ్స్ ఉంటే మాత్రం అందహీనంగా కనిపిస్తారు.
వాస్తవానికి బ్లాక్ హెడ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.అయితే వాటిని నివారించుకునేందుకు కూడా చాలా పద్ధతులు ఉన్నాయి.
ముఖ్యంగా పురుషులు బ్లాక్ హెడ్స్‌ను త్వరగా నివారించుకోవాలి అని అనుకుంటే.వారికి ఉసిరి గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి ఉసిరి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
ముందుగా కొన్ని ఉసిరి కాయలు తీసుకుని.
తురిమి రసం తీసుకోవాలి.ఆ రసంలో కొద్దిగా బియ్యం పిండి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్నా బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి బాగా ఆరిన తర్వాత రద్దుతూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా డే బై డే మంచి మంచి ఫలితం ఉంటుంది.ఉసిరి కాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండి బెట్టి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక స్పూన్ ఉసిరి కాయల పొడి మరియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. """/"/
బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటే.
ఎండబెట్టి పొడి చేసుకున్న ఉసిరి కాయ పొడిలో చిటికెడు పసుపు మరియు పెరుగు వేసి కలిసి.
అప్లై చేయాలి.బాగా ఆరిపోయిన తర్వాత నీటి సాయంతో బాగా నలుపుతూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి.
బీచ్‌లో మెటల్ డిటెక్టర్ పట్టుకొని వెళ్లాడు.. అతనికేం దొరికిందో తెలిస్తే షాకే!!