ఇమ్యూనిటీ పెంచే ఉసిరి.. ఎలా తీసుకోవాలంటే?

ఉసిరి.వీటి గురించి తెలియ‌ని వారుండ‌రు.

ఉసిరి కాయ‌ల‌తో కొంద‌రు ప‌చ్చ‌ళ్లు కూడా పె‌డుతుంటారు.కాస్త పుల్ల‌గా, వ‌గ‌రుగా ఉంటే ఉసిరి కాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరి ఉప‌యోగిస్తారు.ముఖ్యంగా సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఉసిరి కాయ‌లు కీల‌క పాత్ర పోషిస్తుంది.

అటువంటి ఉసిరి కాయ‌లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి (ఇమ్యూనిటీ) పెంచ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ప్ర‌స్తుతం అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తూ.ప్ర‌జ‌ల‌ను, ప్రభుత్వాల‌ను ముప్ప‌తిప్పుడు పెడుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ను అంతం చేసే స‌రైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.దీని బారిన ప‌డ‌కుండా ఉండ‌ట‌మే ప్ర‌ధాన మార్గంగా మారింది.

ఇక క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే.రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డం చాలా ముఖ్యం.

అయితే ఉసిరితో శ‌రీర రోగ నిరోధ‌క శక్తి బ‌ల‌ప‌డుతుంది.ఎందుకంటే.

ఉసిరి కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.అలాగే ఉసిరి కాయ‌ల్లో ఇతర పండ్లలో కన్నా యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డ‌మే కాకుండా.జలుబు, దగ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా ఉసిరి దూరం చేస్తుంది.

అందుకే ఉసిరిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవ‌చ్చు.ఉసిరి టీ లేదా సలాడ్స్ లో ఉప‌యోగించ‌డం ఇలా ఎలాగైనా ఉసిరి కాయ‌ల‌ను తీసుకోవ‌చ్చు.

ఉసిరి వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.మ‌ధుమేహం ఉన్న‌వారు ఉసిరి తీసుకుంటే.

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.

మ‌ల‌బ‌ద్ధకం, జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.అలాగే కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ ఉసిరి ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రియు గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.కాబ‌ట్టి, ఉసిరి కాయ‌ల‌ను నిత్యం ఏదో ఒక‌రూపంలో తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి.

వేలానికి హిట్లర్ సన్నిహిత మిత్రుడి విల్లా.. దాని విశేషాలు ఇవే..?