సైబర్ సెక్యూరిటీ: 1,00,000 మంది అమెరికన్లకు శిక్షణ.. 10 బిలియన్ డాలర్లను వెచ్చించనున్న గూగుల్

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.

రష్యా, చైనా తదితర దేశాలకు చెందిన సైబర్ ముఠాలు అమెరికాలోని దిగ్గజ కంపెనీల టార్గెట్‌గా చేసుకుని భారీగా నగదు డిమాండ్ చేయడమో లేదంటే గంటల తరబడి సేవలను స్తంభింపజేయడమో చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టింది.అటు టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఈ రంగంలో పెరుగుతున్న అవకాశాలను, దేశానికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి వచ్చే ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.

సైబర్ సెక్యూరిటీలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగాలని గూగుల్ సూచించింది.

గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 1,00,000 మంది అమెరికన్లకు ఐటీ సపోర్ట్, డేటా అనలిటిక్స్, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ సహా డిమాండ్ వున్న నైపుణ్యాలను నేర్చుకోవడంలో శిక్షణ ఇస్తామని కంపెనీ తెలిపింది.

సైబర్ దాడులు విలువైన డేటా, క్లిష్టమైన మౌలిక సదుపాయాలను మరింత ప్రమాదంలో పడేస్తున్నాయని గూగుల్ గ్లోబల్ అఫైర్స్ ఎస్‌వీపీ కెంట్ వాకర్ అన్నారు.

సైబర్ సెక్యూరిటీ వ్యవహారంపై ప్రభుత్వాలు, కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇటీవల హ్యాకింగ్ ఘటనల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహాయపడతామని ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు బుధవారం హామీ ఇచ్చాయి.

దీనిలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యూఎస్) ఖాతాదారులందరికీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డివైస్‌ను ఉచితంగా ఇవ్వాలని అమెజాన్ భావిస్తోంది.

"""/"/ ఇటీవల భారీ సోలార్ విండ్స్ హ్యాక్, కాసేయా ర్యాన్‌సమ్‌వేర్ దాడి, కలోనియల్ పైప్‌లైన్ షట్‌డౌన్ వంటి ఘటనల నేపథ్యంలో బైడెన్ టెక్ దిగ్గజాలతో సైబర్ సెక్యూరిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?