గూగుల్‌ తాజా బ్లాగ్‌పోస్ట్… మెసేజెస్‌ గ్రూప్‌ చాట్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్!

ఈ స్మార్ట్ యుంగంలో డేటా అనేది కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసినదే.

ప్రస్తుతం అన్ని ఆన్లైన్ లావాదేవీలు స్మార్ట్ ఫోన్‌ ఆధారంగానే నడుస్తున్నాయి.అందుకనే కీలక సమాచారం అంతా స్మార్ట్‌ఫోన్‌లలోనే అంతర్లీనంగా దాగి ఉంటుంది.

దాంతో వివిధ మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు డేటాను దొంగిలించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటివి కూడా హ్యాకర్ల చేతికి చిక్కడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

అందుకే ఆయా కంపెనీలు యూజర్‌ డేటాకు ప్రైవసీ, సెక్యూరిటీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఈ ఎన్‌క్రిప్షన్‌ డెవలప్మెంట్ అనేది వచ్చింది.వాట్సాప్‌ మెసెంజర్‌లో సెండ్‌ చేసే మెసేజ్‌లకు కూడా ఎన్‌క్రిప్షన్‌ ఉందనే విషయం మీకు తెలుసు.

ప్రస్తుతం మెసేజెస్‌కి కూడా ఎన్‌క్రిప్షన్‌ కల్పించాలని, మెసేజెస్‌ గ్రూప్‌ ఛాట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి చేయాలని గూగుల్‌ యోచిస్తోంది.

దానిలో భాగంగానే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ను డెవలప్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే గూగుల్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ఆర్‌సీఎస్ (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్- Rich Communication Services) గ్రూప్ చాట్‌లను టెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

"""/"/ మరికొన్ని రోజుల్లో ఓపెన్ బీటా ప్రోగ్రామ్‌ ద్వారా కొంతమంది వినియోగదారులకు ఇది అందుబాటులో వస్తుందని ప్రకటించింది.

ఈ ఫీచర్‌ వలన ఉపయోగాలు ఎన్నంటే, గూగుల్‌ మెసేజెస్‌ ఉపయోగించి పంపిన వన్‌- ఆన్‌- వన్‌ టెక్స్ట్‌లు కూడా ఎన్‌క్రిప్ట్‌ అవుతాయి.

దీంతో ఈ మెసేజ్‌లు ప్రైవేట్‌గా, సెక్యూర్‌గా ఉంటాయి.అంతేకాకుండా ఇక్కడ వీటిని సెండర్‌, రిసీవర్‌ తప్ప మరొకరు చూడలేరు.

బ్లాగ్‌ పోస్ట్‌లో గూగుల్ ఈ విషయాలనే పేర్కొంది.రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టెక్స్టింగ్‌ను మరింత సురక్షితంగా చేయడమే కాకుండా, బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందిస్తుందని చెప్పడం విశేషం.