ఆ దేశంలో గూగుల్ సేవలకు అంతరాయం…!

టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సంస్థ సంబంధించి సేవలు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అంతరాయం ఏర్పడినట్లు అర్థమవుతోంది.అమెరికా దేశపు కాలమాన ప్రకారం గురువారం నాడు సాయంత్రం 6 గంటల నుండి 6 : 20 నిమిషాల మధ్య గూగుల్ సేవలకు పూర్తి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి అమెరికాలోని చాలా వెబ్ సైట్స్ ఈ విషయాలను ధృవీకరించాయి కూడా.

దాదాపు 20 నిమిషాల పాటు గూగుల్ సేవలు నిలిచిపోవడంతో అనేకమంది ఇబ్బందుల పాలయ్యారు.

గూగుల్ సేవలకు సంబంధించి మ్యాప్స్, జిమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ లాంటి సర్వీస్ లో అన్ని కూడా ఓపెన్ అవ్వలేదు.

ఈ సంఘటనతో సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెల్లువ చేశారు.

అయితే ఈ విషయం గూగుల్ తెలుసుకొని సమస్యను పరిష్కరించడానికి 20 నిమిషాలు పట్టింది.

ఆ తర్వాత జరిగిన అంతరాయానికి గూగుల్ సంస్థ క్షమాపణలు తెలియజేసింది.అయితే ఈ సమస్య కేవలం అమెరికా లోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే అనేకమంది యూజర్లకు గూగుల్ సేవలు అందట్లేదన్న ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.

ఈ సమస్య కేవలం మామూలు గూగుల్ యూజర్లకు మాత్రమే కాకుండా, గూగుల్ సంస్థకు చెందిన క్లౌడ్ సేవలను ఉపయోగించే కార్పొరేట్ కస్టమర్లకు కూడా అనేక ఇబ్బందులు కలిగినట్లు సమాచారం.

అయితే కేవలం అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం.

ఆ సమయంలో మిగతా ప్రపంచం మొత్తం గూగుల్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

అయితే కేవలం ఆ ప్రాంతానికి సంబంధించి మాత్రమే గూగుల్ సేవలు ఎలా అంతరాయానికి గురయ్యాయని శోధించగా.

గూగుల్ అందుకు ఆ ప్రాంతానికి చెందిన పలు సర్వర్స్ క్రాష్ అవ్వడం ద్వారానే ఈ సమస్య వచ్చినట్లు పేర్కొంది.

రెండుసార్లు ఫెయిల్.. ఐదో ప్రయత్నంలో సివిల్స్ లో ఏడో ర్యాంక్.. వరుణ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!