కొత్త పిక్సెల్ ఫోన్ విడుదల చేయనున్న గూగుల్.. ఫీచర్లు ఇవే

గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.ఇప్పుడు అంతా ఫోల్డబుల్ ఫోన్ల యుగం నడుస్తోంది.

దీంతో సరికొత్త పిక్సెల్ ఫోన్‌ను గూగుల్ మార్కెట్‌లోకి త్వరలో విడుదల చేయనుంది.అయితే దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు ఎలా ఉంటాయో లీక్ అయ్యాయి.

గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి.ఇందులో 5.

9-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, 7.69-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని తేలింది.

దీనిని చూడగానే ఒప్పో ఫైండ్ ఎన్ లాంటి నోట్‌బుక్ డిజైన్‌ దర్శనమిస్తోంది.వెనుక చూస్తే ప్యానెల్ పిక్సెల్ 7 ప్రో మాదిరిగానే ఉంటుందని నివేదికలు వెల్లడించాయి.

ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు కెమెరా సెన్సార్ల పక్కనే గూగుల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షేడ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.ఇదే రంగును గత నెలలో జోన్ ప్రోసెర్ టిప్ చేశారు.

పిక్సెల్ ఫోల్డ్‌లో టెన్సర్ G2 చిప్‌సెట్ అమర్చి ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి.మామూలుగానే, గూగుల్ పిక్సెల్ బడ్స్ సేల్స్ పెంచడానికి గూగుల్ పిక్సెల్ ఫోన్లకు హెడ్‌ఫోన్ జాక్ ఉంచరు.

"""/"/ ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు అదే తరహాలో జాక్ లేదని అర్థం అవుతోంది.

ఈ ఫోన్‌లతో పెన్ను కూడా ఉండే అవకాశం ఉంది.సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఎల్‌ ఆధారంగా పని చేయనుంది.

దీని బరువు 263 గ్రాములు ఉండే అవకాశం ఉంది.ఇందులో 12 జీబీ ర్యామ్‌ ఉండనుంది.

ఫోన్ ధర 1,799 డాలర్లు ఉండే అవకాశం ఉంది.అంటే భారత మార్కెట్‌లో ఇది దాదాపు రూ.

1.45 లక్షల ధర ఉండవచ్చు.

మే 2023లో దీనిని మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎంటర్టైన్మెంట్ ఉండగా అవి అవసరమా డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో మెసేజ్ వైరల్!